దేవరకొండ ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడిగా మురళీకృష్ణ

56చూసినవారు
దేవరకొండ ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడిగా మురళీకృష్ణ
దేవరకొండ నియోజకవర్గం ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడిగా నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామానికి చెందిన పొట్టేపాకు మురళీకృష్ణ నియమితులయ్యారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షుడు అంబటి సోమన్న శనివారం అందజేశారు. తన నియామకానికి సహకరించిన ఐ ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షుడు డా. సంజీవరెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులకి మురళీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్