క్యాలెండర్ ఆవిష్కరణ

1122చూసినవారు
క్యాలెండర్ ఆవిష్కరణ
తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం (TPSA)ఆధ్వర్యంలో 2023 క్యాలెండర్ను దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ మంగళవారం దేవరకొండ క్యాంప్ కార్యాలయంలో కార్యదర్శులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు పల్లేటి సరస్వతి కన్వీనర్ గోరేటి జంగయ్య అంకం శ్రీధర్ ధార విక్రమ్ పాల్గొనగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్న గ్రామ కార్యదర్శి లను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వారు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ప్రతినిత్యం గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తున్న కార్యదర్శుల సంఘాన్ని అభినందిస్తున్నానని క్యాలెండర్ ఆవిష్కరించడం శుభసించమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎంపీపీ నల్లగాస్ జాన్ యాదవ్ జడ్పిటిసి మారుపాకుల అరుణ సురేష్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హనుమంతు వెంకటేష్ గౌడ్ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ గౌడ్ జహీర్ శ్రీకాంత్ కోటేష్ కిరణ్ అనిల్ శైలేందర్ ప్రశాంతు శిరీష ఉపేందర్ సైదులు సత్యం సంధ్య నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్