
ఈఓఎస్-09 ఉపగ్రహం ప్రయోజనాలు ఇవీ..
ఈఓఎస్-09 ఉపగ్రహం బరువు 1,696.24 కిలోలు. దీని జీవితకాలం ఐదేళ్లు. జాతీయ భద్రత, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వంటి అంశాలను ఇమేజింగ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన రియల్ టైం కవరేజీ అవసరాన్ని పరిష్కరించే లక్ష్యంతో ఈఓఎస్-09 కూడా భూ పరిశీలన ఉపగ్రహాల సమూహంలో చేరనుంది. ఈ ఉపగ్రహం రిసోర్స్‌శాట్, కార్టోశాట్, రీశాట్-2బి సిరీస్ ఉపగ్రహాల మాదిరి డేటా సేకరించి చేరవేయనుంది. ఈఓఎస్-04 ఉపగ్రహానికి ఇది ప్రత్యామ్నాయం.