ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

83చూసినవారు
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మిర్యాలగూడ మండలం తడ్కమల్ల గ్రామం సలుకునూర్ శ్రీ విద్యానికేతన్ 1997-98 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి గ్రాండ్ హోటల్ లో ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులంతా ఒక్క చోట చేరి తమ చిన్న నాటి బాల్య స్మృతులను గుర్తు చేసుకోవడం తో పాటు తమకు విద్యాబుద్దులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానం చేసారు. అనంతరం బాల్యమిత్రుల యోగ క్షేమాలు తెలుసుకొని ప్రస్తుతహోదాలను అడిగితెలుపుకున్నారు. మిర్యాలగూడ మండల సమాచార హక్కు వికాస సమితి మండల అధ్యక్షులు ఎంఏ కలీం అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో వీరమళ్ళ శ్రీధర్ గౌడ్, ఎంఏ కరీం, నవీన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్