ఆధార్ కార్డులో జూన్ 14 లోపు వ్యక్తిగత వివరాలు అప్‌డేట్ చేయకపోతే కార్డు పని చేయదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వదంతులను నమ్మొద్దని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ తెలిపింది. ఆధార్‌లో ఉచితంగా వివరాలు సవరించుకోవడానికి మాత్రమే జూన్ 14 గడువని తెలిపింది. మార్చుకోకపోయినా ఆధార్ పనిచేస్తుందని స్పష్టం చేసింది. ఆ తర్వాత కూడా ఆధార్ కేంద్రాలకు వెళ్లి నిర్దేశిత రుసుము చెల్లించి వివరాలు మార్చుకోవచ్చని తెలిపింది.