మిర్యాలగూడ నియోజకవర్గం తడకమళ్ళ గ్రామానికి చెందిన బోర మారయ్య సీనియర్ యాదవ సంఘం నాయకులు, సతీమణి బోర మల్లమ్మ దశదినకర్మ గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి డివిజన్ యాదవ సంఘం మిర్యాలగూడ గౌరవాధ్యక్షుడు చింతలచెరువు లింగయ్య యాదవ్, కార్యదర్శి చేగోండి మురళి యాదవ్, గౌరవ సలహాదారు గుండె బోయిన నాగేశ్వరరావు యాదవ్, గౌరవ సలహాదారు కేపీ రాజు యాదవ్ పాల్గొని నివాళులు అర్పించారు.