జీవో 29 అమలుతో ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుందని బంజార ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, టీజీయుఎస్ నాయకులు తిరుపతి నాయక్ లు అన్నారు. ఆదివారం మిర్యాలగూడలో జరిగిన బంజారా ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, ఉపాద్యాయ నియామకాల్లో మెరిట్ కమ్ రోస్టర్ పాటించాలని కోరారు. 29 జీవో వల్ల ఎస్సీ, ఎస్టీలను వారి రిజర్వేషన్ మేరకే పరిమితం చేస్తున్నారన్నారు.