మిర్యాలగూడెం: భారత ప్రజలు గర్వించదగ్గ మేధావి అంబేద్కర్

84చూసినవారు
మిర్యాలగూడెం: భారత ప్రజలు గర్వించదగ్గ మేధావి అంబేద్కర్
మిర్యాలగూడెం మండలం ఉట్లపల్లి గ్రామంలోని మేధా ఫౌండేషన్ కార్యాలయంలో శుక్రవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు వేణు, నాగరాజు మాట్లాడుతూ అంబేద్కర్ యావత్ భారత ప్రజలు గర్వించదగ్గ మేధావి, విద్యావేత్త అన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ గౌరవ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, కొవ్వొత్తులతో నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్