
చెన్నైపాలెం: పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు
బాల్య దశలో పాఠశాలలో చేరి ఆడి పాడి గడిపిన విద్యార్థులు పదవ తరగతి పూర్తి కావడంతో 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు పలికారు. త్రిపురారం మండలంలోని చెన్నైపాలెం ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్ధిని, విద్యార్ధులు వీడలేమంటూ వీడిపోతున్నమంటూ ఆడిపాడి ఆనందంగా గడిపారు. పాఠశాలలో చదివి పదవ తరగతి పూర్తి చేసి వెళ్ళిపోతున్న విద్యార్థులు రోదిస్తూ వీడ్కోలు పొందారు. వారిని చూసి మిగిలిన విద్యార్థులు రోదించారు.