నాంపల్లి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రజా పాలనలో నూతన గృహ నిర్మాణం కోరకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్దులకు ఇందిరమ్మ ఇండ్లు(యాప్) ద్వారా పంచాయతీ కార్యదర్శులు, వెలుగు సీసీలు, ఫీల్డ్ అసిస్టెంట్ లు ఇందిరమ్మ ఇండ్లు(యాప్)ప్రత్యేక లాగిన్ నుండి గ్రామాలలో సర్వే నిర్వహిస్తున్నారు. కావున ప్రజలు ఇట్టి విషయంలో సర్వేకి వచ్చే అధికారులకు సహకరించాలని గురువారం మండల అభివృద్ధి అధికారి మేరి స్వర్ణ కుమారి తెలిపారు.