మానవత్వం చాటిన గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ కోడి శ్రీనివాసులు

85చూసినవారు
మానవత్వం చాటిన గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ కోడి శ్రీనివాసులు
చండూరు మండల్, మునిసిపాలిటీ పరిధిలోని 6వ వార్డుకు చెందిన రాపోలు సాంబమ్మ నిరుపేద మహిళ అకాల మరణం చెందారు. సోమవారం విషయం తెలుసుకున్న స్థానిక గాంధీజీ ఫౌండేషన్ ఛైర్మెన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యం కల్పించారు. అనంతరం నిత్యావసర సరుకులు 50 కేజీల బియ్యం, పప్పు దినుసులు, ఇతర కిరాణ వస్తువులు అందజేసి మానవత్వం చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్