మర్రిగూడ మండలంలో తహశీల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్, సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 18 వేలు ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలని, అర్హులైన వారికి సెకండ్ ఏఎన్ఎం లుగా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.