ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

55చూసినవారు
ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నాంపల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్ సెంటర్ లో ఆదివారం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ నక్క చంద్రశేఖర్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు పూల చక్రధర్, యూత్ అధ్యక్షులు నాంపల్లి సంజీవ, యువ నాయకులు మధు, సింగిల్ విండో డైరెక్టర్ పెళ్లి సత్తయ్య యాదవ్, నెరల్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్