భువనగిరి ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా వెంకటయ్య నామినేషన్

15412చూసినవారు
భువనగిరి ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా వెంకటయ్య నామినేషన్
భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో స్వతంత్ర ఎంపీ అభ్యర్థి నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన దీవెన ఫౌండేషన్ చైర్మన్ బుషిపాక వెంకటయ్య మంగళవారం నామినేషన్ వేశారు. ఆయన మాట్లాడుతూ తనని గెలిపిస్తే నాంపల్లి మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వచ్చేల కృషి చేస్తానన్నారు. ప్రజల గొంతుకనై అభివృద్ధికి బాటలు వేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పులిగుజ్జు, బాబు, కోరే పరమేశ్, బషిపాక ప్రశాంత్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్