అనుముల మండలంలోని గ్రామానికి చెందిన ఆయుత నాగరాజుకు వరి గడ్డి కట్టే మిషన్లో పడి ప్రమాదవశాత్తు చెయ్యి విరిగింది. హాస్పిటల్లో చికిత్స పొందగా వైద్యులు ఎడమ చెయ్యిని తొలగించారు. విషయం తెలుసుకున్న ధర్మరక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు అనుముల నవీన్ కుమార్ & ఫౌండేషన్ సభ్యుల సహకారంతో శనివారం బాధిత కుటుంబానికి సందర్శించి వైద్య ఖర్చులకు నిమిత్తం 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.