నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు రాత్రి వేళ విద్యుత్ దీపాలంకరణతో కొత్త శోభను సంతరించుకుంది. ప్రజా పాలన వియోత్సవాల్లలో భాగంగా నాగార్జున సాగర్ ప్రధాన డ్యామ్ కు అధికారులు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. మువ్వన్నెల రంగులతో నిండిన విద్యుత్ దీపాల కాంతులు క్రస్టు గేట్లకు తాకేలా అమర్చారు. దీంతో విద్యుత్ దీపాల అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.