నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా అవగాహన సదస్సు

873చూసినవారు
నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా అవగాహన సదస్సు
నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజనీతి శాస్త్రం విభాగం అధ్యాపకులు జి. మధుసూదన రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా కళాశాల విద్యార్థులకు ఆన్లైన్ లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సు లో ఓటు వజ్రాయుధంతో సమానమని, ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య విజయవంతానికి ఓటు ఎంతో ముఖ్యమని విద్యార్థులకు అవగాహన కలిపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఐదేళ్లకు ఒకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు. అందుకే దేశంలో ఓటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది అని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ కె. చంద్రశేఖర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె. చంద్రశేఖర్, ఇంచార్జ్ వైస్ ప్రిన్సిపాల్ జి. మధుసూదన రెడ్డి, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్