షెడ్లను తొలగించి,రోడ్డును వెడల్పు చేయాలి

2331చూసినవారు
షెడ్లను తొలగించి,రోడ్డును వెడల్పు చేయాలి
కట్టంగూరు మండలంలో జాతీయ రహదారి ఎన్హెచ్65 కి గల అండర్ పాస్ వెంట పలు చిరు వ్యాపారులు షెడ్లను నిర్మించుకోవడం జరిగింది. పలు మార్లు అధికారులు తొలగించిన మళ్లీ వేయడం జరిగింది. వాటి వలన పలు మార్లు ప్రమాదాలు జరుగుతున్నాయని,వాహన దారులు మరియు గొర్రెల కాపరులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శనివారం సంత రోజు స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని జిఎంఆర్ అధికారులకు పలుమార్లు తెలియజేసిన పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి షెడ్లను తొలగించి, రోడ్డును వెడల్పు చేయాలని స్థానిక అధికారులను కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్