బీజేవైఎం ఆధ్వర్యంలో డిప్యూటీ తహసిల్దార్ దివ్యకి వినతి పత్రం

669చూసినవారు
బీజేవైఎం ఆధ్వర్యంలో డిప్యూటీ తహసిల్దార్ దివ్యకి వినతి పత్రం
కేతేపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా యువమోర్చా మండల అధ్యక్షులు జటంగి సైదులు ఆధ్వర్యంలో డిప్యూటీ తహసిల్దార్ దివ్యకి మంగళవారం వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను మరియు నిరుద్యోగ భృతిని వెంటనే భర్తీ చేయాలని తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉన్న ఐకెపి సెంటర్లో మొత్తం డిగ్రీ , పీజీ చేసిన విద్యార్థులు మాత్రమే అమాలీలుగా పనిచేస్తున్నారు. ఉద్యోగాలు చేయవలసిన యువతను ఇలాంటి దుస్థితికి తెచ్చిన సీఎం కేసీఆర్ బాధ్యత వహిస్తూ ప్రతి ఒక్క నిరుద్యోగికి 1, 44, 768 నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చేయని పక్షంలో ముందు ముందు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు ఐత గోని అనిత గారు, జిల్లా నాయకులు తాడోజు నరసింహ చారి గారు జిల్లా కార్యవర్గ సభ్యులు జటంగి రామచంద్రయ్య గారు, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి మంగ సతీష్ గారు , బీజేవైఎం మండల నాయకులు పరశురాములు గారు, మండల ఎస్సీ మోర్చా ఇంచార్జ్ చినేని జానీ గారు, మండల కోశాధికారి శేఖర్ గారు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్