నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం గార్లబాయిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులు తరగతి గదుల్లో విద్యాబోధన నిర్వహించారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా, స్వీయ నియంత్రణ విద్యాబోధనలో నైపుణ్యాన్ని ప్రదర్శించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సముద్రాల నారాయణ బహుమతులు ప్రదానం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని వివిధ అంశాలపై నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామస్తులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.