తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో శనివారం నకిరేకల్ మండల కేంద్రంలో నకిరేకల్ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 10న జరిగే మిలియన్ మార్చ్‌ని కొనసాగిద్దాం-తెలంగాణను కాపాడుకుందాం అనే నినాదంతో తెలంగాణ బచావో సదస్సు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలను కోరుతూ ప్రెస్ క్లబ్ కేంద్రంలో తెలంగాణ బచావో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ నియోజకవర్గ కన్వీనర్ పులి పాపయ్య, తెలంగాణ జన సమితి జిల్లా ఉపాధ్యక్షులు సాతిరు యాదయ్య, జిల్లా నాయకులు గడుసు శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్, సుంకర బోయిన మహేష్, నూక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.