కేతేపల్లి మండలంలో భారతీయ జనతాపార్టీ చెర్కుపల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా శనివారం గ్రామంలో 284 బూత్ అధ్యక్షులు మల్లబోయిన శంకర్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పిట్టల వెంకట్, మండల యువ మోర్చా అధ్యక్షులు జటంగి సైదులు, యువ మోర్చా జనరల్ సెక్రెటరీ మంగ సతీష్, బీజేవైఎం ఉపాధ్యక్షులు లింగాల నరేష్, బీజేవైఎం కార్యదర్శి పులుసు కర్ణాకర్, విశ్వబ్రాహ్మణ నియోజకవర్గ అధ్యక్షులు సైదాచారి, మండల నాయకులు సంపత్, L. శ్రవణ్, ఓంకారం, దయాకర్, బద్రి తదితరులు పాల్గొన్నారు.