బీఆర్ఎస్ పార్టీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు మావోయిస్టు పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి కొనపురి సాంబశివుడు 14వ వర్ధంతి సందర్భంగా బుధవారం నల్గొండ లోని అమరవీరుల స్థూపం వద్ద వై ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా కోటేష్ యాదవ్, రాష్ట్ర సలహాదారు బెల్లి నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి సాంబశివరావు అని కొనియాడారు.