రాష్ట్ర ప్రభుత్వం బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్రలో నిలిచిపోయే బడ్జెట్ అని రాష్ట్ర రోడ్లు , భవనాలు , సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అందరికీ ప్రతిఫలాలు అందించే విధంగా బడ్జెట్లో ప్రయత్నించడం జరిగిందని తెలిపారు. బడ్జెట్లో ఇరిగేషన్ పెద్దపీటవేయగా, అందులో నల్గొండ జిల్లా ముందుందన్నారు.