ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు

70చూసినవారు
కనగల్ మండలంతో పాటు అన్ని గ్రామాల్లో మహిళలు ఎంగిలి పువ్వు బతుకమ్మ పండుగను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున రకరకాల పువ్వులతో బతుకమ్మను అలంకరించి ఒక్కచోట పేర్చి గౌరమ్మను పూజిస్తూ మహిళలు చప్పట్లు వేస్తూ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో కనగల్ మండలంలోని మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్