ప్రణయ్, అమృత కోర్టు తీర్పు పరువు హత్యలు చేసే వారికి ఒక హెచ్చరిక లాంటిదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పేర్కొన్నారు. చిట్యాలలో మంగళవారం స్థానిక సీపీఎం నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. హత్యలు చేసే నీచమైన సంస్కృతిని కొనసాగిస్తున్న వారికి ఇదో గుణపాఠం అని అన్నారు. 78 మంది సాక్షులను ప్రవేశపెట్టడం, పోలీసు వ్యవస్థ పని తీరు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.