ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు కల్పించవద్దు

60చూసినవారు
ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు కల్పించవద్దు
ప్రైవేట్ ఆస్పత్రులు డెంగ్యూ కేసుల పట్ల ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు కల్పించవద్దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర కోరారు. శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధులపై ఐఎంఏ, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులతో సమావేశం నిర్వహించారు. ప్రజలు జ్వరంతో ఆస్పత్రులకు వైద్యం కోసం వచ్చినప్పుడు పరీక్షల అనంతరం నిర్ధారణ కాకుండా ఎట్టి పరిస్థితులలో జ్వరాలను డెంగ్యూగా ప్రకటించవద్దని కోరారు.

సంబంధిత పోస్ట్