నకిరేకల్ లో జరిగిన పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీలో సూత్రధారులు నకిరేకల్ ఎమ్మెల్యే అనుచరులే సూత్రధారులని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే అనుచరులు కొందరు లీకేజీలకు కారణమన్నారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యంతో కుమ్మక్కై రోజు పేపర్ లీకేజీ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు.