నల్గొండ: హనుమాన్ ర్యాలీని విజయవంతం చేయాలి

77చూసినవారు
నల్గొండ: హనుమాన్ ర్యాలీని విజయవంతం చేయాలి
హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని బజరంగ్ దళ్ విభాగ్ కన్వీనర్ కోకల సందీప్, జిల్లా కన్వీనర్ బజరంగ్ దళ్ నరసింహ పిలుపునిచ్చారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో వారు హనుమాన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర ర్యాలీ ఏప్రిల్ 12న పాతబస్తీ హనుమాన్ దేవాలయం నుండి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్