అభివృద్ధి పనుల్లో అలసత్వాన్ని సహించను

63చూసినవారు
చండూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి శనివారం తమ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. చండూరు పట్టణంలో నిలిచిపోయిన 400 మీటర్ల రోడ్డు వెడల్పు అభివృద్ధి పనులు నిలిచిపోవడానికి కారణాలు పరిష్కరించి వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంట్లో భాగంగానే తక్షణమే పెండింగ్ లో ఉన్న 400 మీటర్ల రోడ్డు వెడల్పుకు సెంట్రల్ లైన్ ఫిక్స్ చేసి మార్కింగ్ చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్