నల్లగొండ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, కౌన్సిలర్లు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.