నల్లగొండ పట్టణం పద్మా నగర్ కాలనీకి చెందిన భారతీయ జనతా పార్టీ చేనేత సెల్ రాష్ట్ర కన్వీనర్ మిర్యాల వెంకటేశం, బిజెపి పట్టణ పార్టీ కన్వీనర్ గా నియమితులైన సందర్భంగా పద్మశాలి సంఘం, బీసీ సంఘం, లైన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. గత 20 సంవత్సరాలుగా పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న ఆయనకు తగిన గుర్తింపు లభించడం సంతోషదాయకమని ఆదివారం వారన్నారు.