ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో ఉపయోగపడుతుందని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి చాడ. కిషన్ రెడ్డి అన్నారు. మాడ్గులపల్లి మండలం చెర్వుపల్లి గ్రామానికి చెందిన అల్లంపల్లి రమణమ్మ ఇటీవల అనారోగ్యానికి గురై ఆర్థిక సాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన రూ. 21 వేల చెక్కును గురువారం స్థానిక నాయకులతో కలిసి ఆయన లబ్ధిదారుకు అందజేశారు.