మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులు తయారి చేసిన అనేక రకాల హ్యాండ్ క్రాఫ్ట్స్, కళాకృతుల స్టాల్ ను శాసనసభ్యులు, బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బధిర విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. అలాగే విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సందీపా రెడ్డిని అభినందించారు.