సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఐతగోని శేఖర్ గౌడ్ ఆదివారం స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మురికి కూపంలో విషపు కలుషిత నీరు తాగి అనారోగ్యం పాలవుతున్న నల్లగొండ జిల్లా ప్రజల కష్టాలు తీరాలని తెలంగాణ ప్రభుత్వం మంచి ఆలోచనతో మూసి ప్రక్షాళన చేపడితే, ఓర్వలేక విషం చిమ్ముతున్న కేటీఆర్ తక్షణమే సీఎంకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.