నల్గొండ: విద్యుత్ షాక్ తో ఆవు మృతి

74చూసినవారు
నల్గొండ: విద్యుత్ షాక్ తో ఆవు మృతి
నల్గొండ మండల పరిధిలోని నర్సింగ్ బట్లలో విద్యుత్ షాక్ తో ఆవు మృతిచెందింది. గ్రామానికి చెందిన మాధగోని సత్యనారాయణకు చెందిన ఆవు శుక్రవారం ప్రమాదవశాత్తు కరెంటు వైర్ తగిలి మృతి చెందడంతో అతను కన్నీరు మున్నీరయ్యాడు. ఆవు మృతి చెందడంతో సుమారు 50 వేల పైగా నష్టపోయానని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు మాధగోని సత్యనారాయణ వేడుకున్నారు

సంబంధిత పోస్ట్