నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో స్థానిక నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అవుట్సోర్సింగ్ జేఏసీ రాష్ట్ర నాయకులు తిరుగమల్ల షాలెమ్ రాజు పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.