వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి

60చూసినవారు
వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి
గుండాల మండలంలోని వివిధ గ్రామాల్లో పనిచేసిన గ్రామపంచాయతీ సిబ్బందికి గత కొన్నినెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, వెంటనే పెండింగ్ జీతాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో ఏ. దేవికకు గ్రామ పంచాయతీ సిబ్బంది వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ మండల ఉపాధ్యక్షుడు ఇటికాల పరశురాములు, గిరిబాబు, స్వప్న, ప్రభాకర్, రాజు, యాదయ్య, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.