మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో సర్వశక్తి గణపతి పూజలు

279చూసినవారు
మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో సర్వశక్తి గణపతి పూజలు
నల్గొండ మండల పరిధిలోని చందనపల్లి గ్రామంలో గల మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో గురువారం సర్వశక్తి గణపతి పూజలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి మాట్లాడారు. సకల జనుల విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుడు ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్