చిట్యాల మండలం చిన్నకాపర్తి ఎస్సీ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్దులు ఉపాధ్యాయులుగా, ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా విధులు నిర్వర్తించారు. సీఎంగా పొలిమేర దక్ష, కలెక్టర్ గా ఆవుల సోనీ, డీఈవోగా వైష్ణవి, ఎంపీడీవో గా చైత్ర, ఎంఈఓగా అక్షిత్, హెచ్ఎంగా రవితేజ పాత్రలను పోషించారు. హెచ్ఎం రఘు, ఉపాధ్యాయునిలు కౌసర్, సింధు పాల్గొన్నారు.