శాలిగౌరారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సోమవారం ఎంపీడీవో జ్యోతిలక్ష్మి సమావేశం నిర్వహించారు. ఎండాకాలంలో గ్రామాలలో నేటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో జ్యోతిలక్ష్మి అన్నారు. ఇంటి పన్ను వసూళ్లు, ఉపాధి కూలీలకు పని కల్పించాలని తెలిపారు. మొక్కలకు నీరు అందించి మొక్కల పెంపకానికి దోహదం చేయాలన్నారు.