ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తూచా తప్పకుండా సంపూర్ణంగా అమలు బాధ్యత నేనే తీసుకుంటానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన నాగార్జున సాగర్ లో ఏర్పాటుచేసిన ఆదివాసీలు, గిరిజనుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కి సంబంధించి తాను చీఫ్ విప్ గా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమావేశపరిచి అధిష్టానానికి ఒక నివేదిక ఇచ్చి తప్పకుండా అమలు చేయాలని కోరుతున్నారు.