గత ప్రభుత్వంలో ప్రజా రవాణా వ్యవస్థ పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ట పరచాలన్నారు. మునుగోడు లోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయని, నియోజకవర్గంలో 2 ఎక్సప్రెస్ రూట్లను నడపాలని తెలిపారు.