విద్యార్థినిలు అనారోగ్యం పాలు కాకుండా కేజీబీవీ ల పరిసరాలతో పాటు వంట గది, ఇతర గదులను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా శాలిగౌరారం కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మిఖంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వంటగదిని, డ్రైనేజీ ప్రాంతాన్ని పరిశీలించగా అవి రెండు అపరిశుభ్రంగా ఉండుట పై అసహనం వ్యక్తం చేశారు.