హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలపై బుధవారం ఆయన స్పందించారు. రాష్ట్రంలో ఏ పార్టీ కార్యాలయానికి అనుమతి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు అప్పీల్కు వెళ్తామని తేల్చి చెప్పారు.