మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం అన్నారు. బుధవారం స్థానిక ఈనాడు ఆఫీస్ వద్ద రోడ్డు భద్రత మాసోత్సవల్లో భాగంగా వాహనదారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ట్రాఫిక్ ఎస్సై అన్నారు. ప్రమాదాల నివారణకు పోలీస్‌శాఖ అనేక చర్యలు చేపడుతున్నా జరుగుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. కేసులు పునరావృతం అయితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.