సైన్స్ ప్రతిభ, పాటవ పోటీలు

586చూసినవారు
సైన్స్ ప్రతిభ, పాటవ పోటీలు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు సైన్స్ ప్రతిభ, పాటవ పోటీలను నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల నుంచి 66 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన 9 మంది విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం. రాములు, జన విజ్ఞాన వేదిక మండల కన్వీనర్ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్