మక్తల్ పట్టణంలో కోలువై ఉన్న అతి పురాతన పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ధర్మకర్త ప్రాణేషాచారీ, ఈవో శ్యామసుందర్ చారీ తెలిపారు. ఉత్సవ విగ్రహాన్ని పల్లకి వెళ్లే పురవీధుల గుండా దేవాలయం వరకు విద్యుత్ దీపాలతో అలంకరించారు. 15న సాయంత్రం మూడు గంటలకు పల్లకీసేవ, ఆరు గంటలకు రథోత్సవం నిర్వహించనున్నారు.