నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. పర్వత ప్రాంతాలు మినహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ పరీక్షలను ‘నవోదయ విద్యాలయ సమితి’ 2025 జనవరి 18న నిర్వహించింది. అభ్యర్థులు అడ్మిట్ కార్డులో ఇచ్చిన తమ రోల్‌నెంబర్, పుట్టిన తేదీ తదితర వివరాలను ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఖాళీలను బట్టి అడ్మిషన్ల కోసం నవోదయ విద్యాలయాల్లో రెండు వెయిటింగ్ లిస్ట్‌లను రూపొందిస్తారు.