ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్తగా ఈకో ఫ్రెండ్లీ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ (ఎన్‌సిఎంసి) ఆధారిత డెబిట్, ప్రీపెయిడ్ కార్డులను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఎన్‌పిసిఐ భాగస్వామ్యంతో వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. డెబిట్ కార్డులను తమ ఖాతాదారులకు, ప్రీపెయిడ్ కార్డులను వాలెట్ కస్టమర్లకు అందించనున్నట్లు పేర్కొంది.